విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. (Arjun chakravarthy) విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ వచ్చాయి. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకున్న ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ “అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదు నా తొమ్మిది సంవత్సరాల కల. హీరో విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు.
అర్జున్ చక్రవర్తిగా మైనస్ డిగ్రీల్లో షర్టు లేకుండా నటించాడు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది. గొప్ప థియేట్రికల్ (Great theatrical) అనుభూతినిచ్చే సినిమా ఇది”అని అన్నారు. హీరో విజయరామరాజు మాట్లాడుతూ “మా డైరెక్టర్ సినిమాను నెక్స్ లెవెల్‌లో తీశారు. మా నిర్మాత లేకపోతే ఇంత మంచి సినిమా లేదు. ఈ సినిమాతో చాలా మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాం”అని తెలిపారు. నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ “ఆగస్టు 29న ప్రో కబడ్డీ ప్రారంభమవుతుంది. అదే రోజున నేషనల్ స్పోర్ట్ డే. కబడ్డీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజున రిలీజ్ అవుతుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సిజ రోజ్, అజయ్, దయానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.