Thursday, September 11, 2025

డిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉన్నన విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్, అటామనస్ డిగ్రీ కాలేజీలు ఖాళీ సీట్ల వివరాలు నోటీసులు బోర్డులో పొందుపరచడంతో పాటు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌లో పెట్టాలని తెలిపారు. ఈనెల 15,16 తేదీలలో ఆయా కాలేజీలు స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని పేర్కొన్నారు. అదేవిధంగా లోకల్ విద్యార్థులతో ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్ లోకల్ విద్యార్థుల కోసం ఈ నెల 18,19 తేదీలలో కాలేజీలు స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని తెలిపారు. అయితే ఈ తేదీలలో ముందుగా లోకల్ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తామని, ఆ తర్వాతనే ఖాళీ సీట్లను నాన్ లోకల్ విద్యార్థులకు కేటాయించనున్నట్లు స్పష్టత ఇచ్చారు. కాలేజీలు ఈ నెల 20వ తేదీన స్పాట్ అడ్మిషన్ ద్వారా చేపట్టిన ప్రవేశాల వివరాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయలని చెప్పారు.

Also Read: దేశానికి సీడ్ హబ్ గా రాష్ట్రం: మంత్రి తుమ్మల

ఈమేరకు గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి డిగ్రీ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని తెలిపారు. ఉన్నత విద్యామండలి తీసుకున్న ఈ నిర్ణయంతో టాప్ డిగ్రీ కాలేజీలో సీట్లు మిగిలి ఉంటే విద్యార్థులు చేరేందుకు అవకాశం లభించింది. ప్రస్తుతం ఇందిరా ప్రియదర్శిని మహిళా కాలేజీలో 486 సీట్లు, బేగంపేట మహిళా డిగ్రీ కాలేజీలో 2867 సీట్లు, సైఫాబాద్ సైన్స్ కాలేజీలో 265 సీట్లు, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో 263 సీట్లు,
సిటీ కాలేజీలో 261 సీట్లు, వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 236 సీట్లు,బాబు జగ్జీవన్‌రామ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 228సీట్లు, ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 225 సీట్లు, నిజాం కాలేజీలో 205 సీట్లు, హుస్సేనిఆలంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో 171 సీట్లు, ఫలక్‌నూమా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 133 సీట్లు, సికింద్రాబాద్ పిజి కాలేజీలో 118 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు మిగతా ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రవేశాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News