మన తెలంగాణ/వనపర్తి: 2025/26 సంవత్సరానికి కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని హర్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులలో ఆడ్మిషన్ల కోరకు ఈ నెల 19న స్పాట్ ఆడ్మిషన్లు జరగనున్నాయని మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. పిడిగం సైదయ్య అన్నారు. ఇప్పటికే అప్లికేషన్స్ నమోదు చేసిన 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో జూలై 19న శనివార ఉదయం 10 గంటల లోపు కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్శిటి , ములుగు లోని పరిపాలన భవనంలో జరిగే స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరు కావాలన్నారు. దరఖాస్తు చేయని విద్యార్థులు సైతం ఒరిజినల్ సర్టిఫికట్స్ తో నేరుగా హాజరు కావచ్చు అని తెలిపారు. మరింత సమాచారం కోసం 7780509322, 7683053157 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ఉపాధి అవకాశాలు మెండు
ఉద్యాన డిప్లమో పూర్తి చేసిన విద్యార్థులకు పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఉద్యాన పంటల విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యం, ఉద్యాన ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో, భవిష్యత్తులో శిక్షణ పొందిన ఉద్యాన మానవ వనరులకు మేలైన ఉపాధి అవకాశాలు ఉంటాయని డాక్టర్ పిడిగం సైదయ్య తెలిపారు. ప్రత్యేకించి గ్రామీణ యువత ఉద్యన డిప్లమా పూర్తి చేసినట్లయితే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. నేరుగా బీఎస్సీ హర్టికల్చర్ డిగ్రీలో హర్టిసెట్ ద్వారా సీటు సంపాదించవచ్చు. విత్తన, పురుగుమందులు, ఎరువుల కంపెనీల్లో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయి.