Tuesday, June 3, 2025

శ్రీలీల నిశ్చితార్థం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

- Advertisement -
- Advertisement -

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన నటి శ్రీలీల (Sreeleela). ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. శ్రీలీల సోషల్‌మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. అయితే శ్రీలీల శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ఆమెకు కుటుంబసభ్యులు నలుగు పెడుతూ కనిపించారు. దీంతో అందరూ ఆమెకు నిశ్చితార్థం (Engagement) జరిగి ఉంటుందని భావించారు.

తాజాగా ఈ విషయంపై శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. అవి నిశ్చితార్థం ఫోటోలు కావని తన ప్రీబర్త్‌డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు అని ఆమె వివరించింది. ఈ వేడుకలకు మొత్తం ప్లానింగ్ తన తల్లిదే అని పేర్కొంది. ఈ వేడుకల్లో హీరో రానా సతీమణి మిహిక కూడా ఉండటం మరో విశేషం. జూన్ 14వ తేదీన శ్రీలీల తన 24వ పుట్టినరోజు జరుపుకోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News