మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ సినిమా విడుదల వాయిదా పడింది. ఆగస్టులో రావాల్సిన ఈ మాసాలా ఎంటర్టైనర్, పోస్ట్‌ప్రొడక్షన్ పనుల కారణంగా ఇప్పుడు అక్టోబర్ 31న విడుదల కానుంది. బ్లాక్‌బస్టర్ ధమాకా తర్వాత రవితేజ, -శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ చిత్ర సెట్స్‌లో హీరోయిన్ శ్రీలీల ఒక క్యూట్ వీడియో షేర్ చేసింది. అందులో ఆమె మేకతో ఫన్నీ ఇంటరాక్షన్ చేస్తూ, ఏప్రిల్ తర్వాత ఏమి వస్తుంది? అని అడిగితే, మేక ఇచ్చిన సమాధానం అందరికీ నవ్వు తెప్పించింది. ఈ సీన్ “ఆ ఒక్కటీ అడక్కు’లో రాజేంద్రప్రసాద్ చేసిన ఐకానిక్ సీన్‌ను గుర్తు తెప్పించింది. అంతేకాదు సినిమా నుంచి త్వరలోనే ఫన్ అప్డేట్ ఇస్తానని శ్రీలీల ప్రామిస్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.