Monday, May 26, 2025

సన్‌రైజర్స్‌కు భారీ విజయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విజయం సాధించింది. బ్యాటర్ల ఊచకోత, బౌలర్ల మెరుపు బంతులతో ప్రత్యర్థి జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ 110 పరగులతో విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో క్లాసెన్(106 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(76), అభిషేక్ శర్మ(32) ఊచకోత కోశారు. అనంతరం లక్ష ఛేదనకు దిగిన కోల్‌కతా బ్యాటర్లు 18.3 ఓవర్లకే ఆల్‌ఔట్ అయ్యారు. కోల్‌కతా బ్యాటర్లలో మనీశ్ పాండే(37), హర్షిత్ రాణ(34), సునీల్ నరైన్(31)లు తప్ప మరెవరూ రాణించలేకపోయారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనాద్కత్, ఈషాన్ మలింగా, హర్ష్ ధూబే మూడేసి వికెట్లు పడగొట్టి కోల్‌కతా నడ్డీ విరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News