Monday, September 15, 2025

జాతీయ స్థాయి క్రికెట్ జట్టుకు శ్రీచైతన్య విద్యార్థిని ఎంపిక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఈస్ట్ మారేడ్‌పల్లి శ్రీ చైతన్య స్కూల్ ్ల బ్రాంచి (మెహదీపట్నం జోన్) నుండి గొంగడి త్రిష జాతీయ స్థాయిలో ఇండియా అండర్ 19 టీమ్‌లో స్థానం పంపాదించుకుంది. ఈ నెల 27న ప్రారంభమయ్యే టి 20 సీరీస్‌లో ఆడనుంది. త్రిష ఈస్ట్ మారెడ్‌పల్లి బ్రాంచిలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివింది. యాజమాన్య సహాయంతో ప్రతి రోజు ప్రాక్టీస్‌కు అనుమతి తీసుకుని పట్టుదలతో అటు క్రికెట్ ఆటను, ఇటు పదవ తరగతిలో 10 / 10 జిపిఎను సాధించింది. తన ఎనిమిదేళ్ళ వయస్సులోనే జిల్లా స్థాయి అండర్ 16 జట్టుకు ఆడింది. ఆపై 12 సంవత్సరాల వయస్సులో అండర్ 19 తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం విశేషం. కళాశాల చదువును కొనసాగిస్తూ “బిసిసిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌” అవార్డును గెలుచుకుంది. త్రిష ప్రధానంగా లెగ్ స్పిన్నర్‌గానే కాకుండా బ్యాటింగ్‌లోనూ తన ప్రతిభను కనబరుస్తూ ఆల్‌రౌండర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ మాట్లాడుతూ శ్రీచైతన్య స్కూల్ టెక్నో కరిక్యులమ్ నందు విద్యార్థులు చదువుతో పాటు అనేక ఇతర అంశాలలో కూడా అత్యుత్తమ ప్రతిభను కనబరచవచ్చని దానికి త్రిష ఒక ఉదహరణ అని చెప్పారు. డైరెక్టర్ సీమ త్రిషకు, ఆమె తల్లిదండ్రులకు, ఈస్ట్ మారెడ్‌పల్లి అద్యాపక బృందానికి అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News