- Advertisement -
మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టు ‘కన్నప్ప’. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ముకేశ్ కుమార్‌సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో విష్ణు, మోహన్ బాబుతోపాటు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాలు వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే, విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా కూడా నటిస్తున్నారు. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన సాంగ్ ‘జనులారా వినరారా శ్రీకాళహస్తి గాథ’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం అందించగా.. స్వయంగా అరియానా, వివియానా పాడిన ఈ సాంగ్ ఆలరిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -