Monday, August 18, 2025

రామంతాపూర్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలలో విషాదం… ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీకృష్ణాష్టమి వేడుకలలో భాగంగా రథాన్ని లాగుతుండగా కరెంట్ షాక్ తగిలి ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ మండలం రామంతాపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…గోఖల్ నగర్ లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శోభాయాత్ర చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం ఆగిపోవడంతో యువకులు రథాన్ని లాగుకుంటూ తీసుకెళ్లారు. శోభాయాత్ర ముగింపు దశలో రథానికి విద్యుత్ తీగలు తగలడంతో తొమ్మిది మందికి షాక్ కొట్టి దూరంగా పడిపోయారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఐదుగురు మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులు రాజేంద్రరెడ్డి(45), కృష్ణ యాదవ్(21),  రుద్రవికాస్(39), శ్రీకాంత్ రెడ్డి(39),సురేశ్ యాదవ్(34)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గన్ మెన్ ఉన్నట్టు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News