Thursday, August 28, 2025

శ్రీరామ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

- Advertisement -
- Advertisement -

ప్రాజెక్టులోకి 2 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది..

నిజామాబాద్: ఎగువన గల మహారాష్ట్రలో భారీ వర్షాలు కువడంతో శ్రీరామ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట 39 గేట్లను ఎత్తి దిగువకు 2లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091అడుగులు 80.5 టిఎంసిలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1087.30 అడుగులు 67.332 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ప్రదాన కాల్వలు ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 17,300 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 8000 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు ఎఇఇ రవి తెలిపారు.

దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

శ్రీరామ సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో గోదావరి నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువుల కాపరులు చేపలు పట్టేవారు రైతులు ప్రజలు గోదావరి నది వైపు వెళ్ళవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News