- Advertisement -
అమరావతి: ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రెండు సంవత్సరాల క్రితం నవీన్ భార్య ఆత్మహత్య చేసుకోవడంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి బండ్లవాండ్లపల్లి గ్రామంలో ఉంటున్నాడు. నవీన్ శుక్రవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లడంతో ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. గతంలో తల్లి చనిపోగా ఇప్పుడు తండ్రి హత్యకు గురికావడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధమే యువకుడి హత్యకు కారణమని అరోపణలు వస్తున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -