Saturday, June 21, 2025

మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే

- Advertisement -
- Advertisement -

నార్నే నితిన్ (Narne Nithin) చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో. జాతీయ అవార్డు విన్నర్, ‘శతమానం భవతి’ దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ (Sri Sri Sri Rajawaru) సినిమాతో జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్‌తో యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం అత్యధిక థియేటర్లలో జూన్ 6న ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత చింతపల్లి రామారావు, కో ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి, దర్శక నిర్మాత రాజేష్ పుత్ర, రఘు కుంచే, రచ్చ రవి, సంగీత దర్శకుడు కైలాషా మీనన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ “ఈ సినిమాలో నరేష్ ఒక డైలాగ్ చెబుతారు. మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే. ఈ కాన్సెప్ట్ తో సినిమాను రూ పొందించాం. మా హీరో నార్నే నితిన్ పక్కింటి కుర్రాడిలా మొదలుపెట్టి, యాక్ష న్ పరంగా ఆకట్టుకుంటూ అద్భుతంగా నటించాడు”అని అన్నారు. నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ – ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బిగ్ హిట్ మూవీని నిర్మించాలని నార్నె నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని రూపొందించామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News