Wednesday, April 30, 2025

హంస వాహనంపై సరస్వతీ దేవి అలంకారంలో శ్రీ వేణుగోపాలస్వామి

- Advertisement -
- Advertisement -

తిరుపతి: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు గురువారం రాత్రి 7 గంటలకు సరస్వతి దేవి అలంకారంలో శ్రీ వేణుగోపాల స్వామి హంస వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఇఒ నాగరత్న, ఎఇఒ  పార్థసారథి, సూపరింటెండెంట్  సోమశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News