Friday, May 2, 2025

ఆ డైలాగ్‌తో తిప్పలు‌.. క్షమాపణలు చెప్పిన శ్రీవిష్ణు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువ హీరో శ్రీవిష్ణు సినిమాలు అంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రెస్ అని చెప్పుకోవచ్చు. కాగా, తాజాగా శ్రీ విష్ణు నటించిన చిత్రం ‘సింగిల్’. కేతికా శర్మ, ఇవానా ఈ సినిమాలో హీరోయిన్లు. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రం బృందం విడుదల చేసింది. ఆద్యంతం నవ్వులు పూయించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఓ చిత్ర యూనిట్ మాత్రం ట్రైలర్ చూసి నొచ్చుకుంది.

ఈ సినిమానే ‘కన్నప్ప’. ‘సింగిల్’ ట్రైలర్‌లో కన్నప్ప సినిమాలోని ఓ డైలాగ్‌ని కామెడీగా చూపిస్తూ.. వాడారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్.. సింగిల్ సినిమాపై ఫైర్ అయింది. దీంతో కన్నప్ప మూవీకి శ్రీవిష్ణు క్షమాపణలు చెబుతూ.. ఓ వీడియోని విడుదల చేశారు. సింగిల్ సినిమాకు ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వచ్చిందని.. కానీ, కన్ని సంభాషణ ‘కన్నప్ప’ మూవీ టింని హర్ట్ చేశాయని తెలిసింది. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అయినప్పటికీ తప్పు కాబట్టి.. ఆ సీన్స్‌ని మేం వెంటనే తొలగించాము. సినిమాలో కూడా ఉండవని స్పష్టం చేశారు.

సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్స్, వేర్వేరు హీరోల నుంచి రిఫరెన్స్త్‌ని తీసుకుంటాంమని అయినపపటికీ ఎవరినైనా బాధపెట్టి ఉండే క్షమించండి అని వివరించారు. ఇండస్ట్రీలో అందరూ ఒ కుటుంబంలా ఉండాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News