Saturday, September 13, 2025

ఆసియాకప్: టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

- Advertisement -
- Advertisement -

అబుదాబీ: ఆసియాకప్-2025లో భాగంగా షేక్ జాయెద్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉంది. మరోవైపు శ్రీలంక (Srilanka) ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడంతో ఆ జట్టు కూడా సిరీస్‌ని విజయంతో ఆరంభించాలని భావిస్తోంది. ఇక బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. టస్కిన్ అహ్మద్ స్థానంలో షారిఫుల్ ఇస్లాం జట్టులోకి వచ్చాడు. మరోవై శ్రీలంక జట్టులోకి హసరంగా వచ్చాడు.

తుది జట్లు :

బంగ్లాదేశ్: పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తాంజిద్ హసన్ తమీమ్, లిట్టన్ దాస్(కెప్టెన్/కీపర్), తౌహిద్ హృదయ్, జాకర్ అలీ, షమీమ్ హొస్సేన్, మహేదీ హసన్, రిషద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సాకిబ్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్.

శ్రీలంక (Srilanka): పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), కమిల్ మిషార, కుసల్ పెరీరా, చరిత్ అసలంక(కెప్టెన్), కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగా, దుష్మంత చమీర, మతీషా పతిరణ, నువాన్ తుషార.

Also Read : మా వేదనను అప్పుడే మర్చిపోయారా.. పహల్గాం బాధితురాలి ఆగ్రహం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News