- Advertisement -
హైదరాబాద్: రామాయణం, మహాభారతం మన జీవితాల్లో భాగం అని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోనే యూనిక్ స్టూడియో అని అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘శ్రీమద్బాగవతం ’ చిత్రీకరణ కార్యక్రమం ప్రారంభం చేశారు.‘ శ్రీమద్బాగవతం’ చిత్రీకరణ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్ లో తొలిషాట్ వేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. రామోజీరావు.. అద్భుతమైన ఫిల్మ్ సిటీ ఇచ్చారని అన్నారు. తాను యూనివర్శల్ స్టూడియో చూడలేదని తెలియజేశారు. ఫిల్మ్ సిటీలో పార్ట్-1 చిత్రీకరణ తెలంగాణకు గర్వకారణం అని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ‘శ్రీమద్బాగవతం’ సాగర్ పిక్చర్ ఎంటర్ టైన్ మెంట్ (Srimad Bhagavatam’ Sagar Picture Entertainment) రూపొందింస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -