హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి సినిమా వచ్చి చాలాకాలమే అయింది. చివరిగా ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు త్రివిక్రమ్. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నారు. నిజానికి అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, అల్లు అర్జున్ బిజీగా ఉండటం వల్ల అది వాయిదా పడింది. అదే సినిమాను తారక్‌తో చేయాలని భావించినా.. అది సెట్ కాలేదు. దీంతో ప్రస్తుతం వెంకటేష్‌తో (Venky-Trivikram) ఓ సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్.
వీరిద్దరి కాంబినేషన్‌లో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలు వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాలకు త్రివిక్రమ్ రచయితగానే పని చేశారు. తొలిసారిగా ఆయన డైరెక్షన్‌లో వెంకటేష్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై (Venky-Trivikram) అంచనాలు భారీగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గురించి సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.
తొలుత ఈ సినిమాలో తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న రుక్మిణీ వసంత్‌ని హీరోయిన్‌గా అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ స్థానంలో పాన్ ఇండియా సినిమా కె.జి.ఎఫ్‌లో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా అనుకుంటున్నారని టాక్. ఈ ఏడాది హిట్-3 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది శ్రీనిధి. ప్రస్తుతం సిద్ధు నటిస్తున్న తెలుసు కదా మూవీలో నటిస్తోంది. ఇప్పుడు వెంకీ-త్రివిక్రమ్ సినిమాలో ఆమె నటిస్తుందనే వార్త నిజమైతే.. ఆమెకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.
Also Read : దీపావళికి ‘మిత్ర మండలి’