Monday, August 18, 2025

శ్రీరాంసాగర్ గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

ఎనిమిది గేట్ల ద్వారా నీటిని వదిలిన అధికారులు
ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

కామారెడ్డి: ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీట మట్టం పూర్తిస్థాయికి చేరుకోవడంతో ఎస్సారెస్పీ అధికారులు ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మరోవైపు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో  గోదావరి నది ద్వారా ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరింది. వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళవద్దని వివరించారు. ప్రాజెక్టు మొత్తం అడుగులు 1091 కాగా,, ప్రస్తుతం 1087 అడుగుల వరకు నీరు చేరింది. దీంతో ఎనిమిది గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోనికి వదులుతున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News