Wednesday, August 20, 2025

శ్రీశైలంకు భారీగా వరద.. 10 గేట్లు ఓపెన్

- Advertisement -
- Advertisement -

శ్రీశైలంకు 4 లక్షల క్యూసెక్కుల భారీ వరద
శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తివేత
జూరాల, సుంకేసుల, హాంద్రీ నదుల నుంచి కొనసాగుతున్న వరద
నాగార్జున సాగర్‌కు 4 లక్షల 9 వేల క్యూసెక్కులు విడుదల
మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి ః శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. మంగళవారం 4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణ బేసిన్‌కు వరద పోటెత్తింది. శ్రీశైలం జలాశయానికి 4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు మంగళవారం పది గేట్లు 14 అడుగుల మేర ఎత్తి 4 లక్షల 9 వేల క్యూసెక్కులకు దిగువ నాగార్జున సాగర్ వైపుకు వదులుతన్నారు. శ్రీశైలం లెఫ్ట్, రైట్ బ్యాంకు విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగుతుంది. కర్ణాటకలోని అలమట్టి, నారాయణ పూర్ ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని జూరాల శ్రీశైలం జలాశయాలు నిండుకుండగా మారాయి. దీంతో పాటు తుంగభద్ర నదికి భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో సుంకేసుల బ్యారేజ్‌కి లక్ష 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో అధికారులు 20 గేట్లు ఎత్తి శ్రీశైలం వైపుకు లక్ష 25 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. హంద్రీ నది నుంచి 2 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.
27ఎన్‌జిపిహెచ్ ః శ్రీశైలం పది గేట్లు ఎత్తిన దృశ్యం
==========

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News