Wednesday, July 9, 2025

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి.. 3 గేట్లు ఓపెన్

- Advertisement -
- Advertisement -

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎపిలోని కర్నూల్ జిల్లాలో ఉన్న శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో బుధవారం అధికారులు ప్రాజెక్టు మూడు రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కారణంగా జలాశయంలోకి ఇన్ ఫ్లో 1,86,064 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 1,45,776 క్యూసెక్కులుగా ఉంది. ఇక, జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 882.10 అడుగులకు చేరుకుంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News