శ్రీశైలం ప్రాజెక్టుకు లక్ష ఇరవై వేల క్యూ సెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ఎగువ జూరాల నుంచి 40 వేల క్యూసెక్కుల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36వేల క్యూసెక్కుల చొప్పున దిగువకు నీటిని వదులుతున్నారు. అదే విధంగా సుంకేసుల బ్యారేజ్ కి 43 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా అధికారులు 8 గేట్లను ఒక మీటర్ చొప్పున ఎత్తి దిగువ శ్రీశైలం వైపుకు 37వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 208 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
885 అడుగులకు గాను ప్రస్తుతం 883.70 అడుగుల నీటిమట్టం ఉంది. ఎగువ కర్ణాటక మహారాష్ట్రలతో పాటు తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. మరో వారం రోజులపాటు ఇదే మోతాదులో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వార 67 వేల క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్ కు వదులుతుండగా రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తి మరో 55 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు వదులుతున్నారు.