- Advertisement -
అమరావతి: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. రెండు గేట్ల ద్వారా నీటి విడుదల చేశారు. ఇన్ ఫ్లో 2,23,625 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 1,27,392 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 882.40 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువన భారీ వర్షాలు కురువడంతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నది భారీ స్థాయిలో వరదలు సంభవిస్తున్నాయి.
- Advertisement -