Wednesday, June 11, 2025

గుడ్ న్యూస్..ఇంటర్ అర్హతతో ఎస్ఎస్‌సీలో ఉద్యోగాలు..

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ, గ్రేడ్ డీ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ధరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దాదాపు 261 ఉద్యోగాల నియామకానికి అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల సంఖ్య: 261
విద్య అర్హత: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ పోస్ట్ కు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ లేదా హిందీ భాషలో భాషలో స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి.
వయసు: 18-30 ఏళ్ల లోపు ఉండాలి
దరఖాస్తుకు ప్రారంభ తేది: 6 జూన్ 2025
దరఖాస్తుకు చివరి తేది: 26 జూన్ 2025
ఫీజు చెల్లింపుకు చివరి తేది: 27 జూన్ 2025
దరఖాస్తు సవరణకు డేట్స్: 1జులై నుంచి జూలై 2 వరకు
ఎగ్జామ్ డేట్స్: 2025 ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 11
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100గా, ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎగ్జామ్: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 100 మార్కులు. మొత్తం 200 మార్కులకు గాను పరీక్ష ఉంటుంది.
పరీక్ష వ్యవధి: 2 గంటలు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, కంప్యూట్ బేస్ డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్ లైన్

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News