టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబి 29’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఎంతో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ కెన్యాలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని రాజమౌళి సహా మూవీ టీమ్ మర్యాదపూర్వకంగా కలిసింది. భేటీ అనంతరం అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు కెన్యా మంత్రి. అదే సమయంలో పలు ఆసక్తికర విషయాలను కూడా సోషల్‌మీడియాలో పంచుకోగా.. అవి వైరల్ గా మారాయి.
“అగ్ర దర్శకుడు రాజమౌళి అనేక పవర్‌ఫుల్ స్టోరీస్, అద్భుతమైన విజువల్స్ తో సినిమాలు తీశారు. లోతైన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడంలో రాజమౌళి ఎంతో పేరుపొందారు. ఆసియాలోనే అతిపెద్ద మూవీగా తెరకెక్కుతున్న మహేష్, జక్కన్న సినిమాలో మసాయిమరా మైదానాలు, నైవాషా, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రాంతాలు భాగం కాబోతున్నాయి. 120 దేశాల్లో సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ 100 కోట్ల మందికి పైగా చేరువయ్యే అవకాశం ఉంది. కెన్యాలో ఈ మూవీ షూటింగ్ చేయడం ఒక మైలురాయిగా నిలుస్తోంది.
ప్రపంచ వేదికపై కెన్యా అందాలను, ఆతిథ్యాన్ని, అందమైన ప్రాంతాలను ప్రపంచానికి చూపెట్టడంలో ఈ సినిమా పవర్‌ఫుల్‌గా పనిచేయనుంది. కెన్యా తన చరిత్రను వరల్డ్ వైడ్‌గా పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ విషయంలో మా దేశం చాలా గర్వపడుతుంది” అని కెన్యా మంత్రి ముసాలియా ముదావాది చెప్పారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఇక అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ మూవీ సాగనుంది. మహేష్ బాబుతోపాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ అందించారు.
Also Read : కెన్యాలో షూటింగ్ ఓ మైలురాయి