Tuesday, July 22, 2025

చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట.. 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్ 18వ సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. తొలిసారిగా తమ అభిమాన జట్టు ట్రోఫీని అందుకోవడంతో అభిమానులు తెగ సంబరాలు జరుపుకున్నారు. అయితే బుధవారం బెంగళూరులో ట్రోఫీ గెలిచిన సందర్భంగా బెంగళూరులో విక్టరీ పరేడ్‌ని జరపాలనుకున్నారు. అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని ఈ పరేడ్‌కి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కానీ, చిన్నస్వామి స్టేడియంలో (Chinnaswamy Stadium) ఆటగాళ్ల సత్కారం మాత్రం జరుగుతోంది.

దీంతో ట్రోఫీ అందుకున్న తమ అభిమాన ఆటగాళ్లు చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు వచ్చారు. ఆటగాళ్లను అభిమానులు చూసేందుకు స్టేడియం (Chinnaswamy Stadium) గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్-2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా అభిమానులు తోసుకెళ్లారు. ఈ క్రమంలో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకంది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News