Saturday, September 6, 2025

తెలుగువారిని మెప్పించలేకపోయిన ‘మదరాసి’

- Advertisement -
- Advertisement -

శివకార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన సినిమా ‘మదరాసి’. ‘అమరన్’ విజయన్ తర్వాత శివకార్తికేయన్ నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: తన చిన్నతనంలోనే ఒక ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకున్న రఘు (శివ కార్తికేయన్) ఆ ఘటనతో డిల్యూషన్ సిండ్రోమ్ కి గురవుతాడు. ఇలా 16 ఏళ్ళు చికిత్స తర్వాత తన జీవితంలోకి మాలతి (రుక్మిణి వసంత్) వస్తుంది. ఇంకో పక్క ఇద్దరు ఫ్రెండ్స్ చిరాగ్ (షబ్బీర్), విరాట్ (విద్యుత్ జమ్వాల్) లు మొత్తం చెన్నైని గన్స్‌తో నింపాలని పెద్ద ప్లాన్ చేస్తారు. ఇది ఎన్‌ఐఏ వారికి పెద్ద సవాలుగా మారుతుంది. ఎన్‌ఐఏ అధికారి ప్రేమ్ (బిజూ మీనన్) తన బృందంతో ఆ గన్ కల్చర్ ని ఆపాలని ప్రయత్నించే మిషన్ లోకి రఘు ఎలా ప్రవేశించాడు? తన ప్రేయసి కోసం రఘు ఏం చేశాడు? ఈ గన్ మాఫియా వెనుక ఉన్నది ఎవరు? గన్ లోడ్ బయటకి రాకుండా ఆపారా, లేదా అనేది మిగతా కథ.

కథనం, విశ్లేషణ: దర్శకుడు మురుగదాస్ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన ఈ సినిమాలో కొత్తదనం కనిపించదు. ఈ మధ్య కాలంలో పలు సినిమాల్లో చూపిస్తున్న గన్ కల్చర్ కాన్సెప్ట్ కి తన స్టైల్ హీరో పాత్ర, దానికో లోపం పెట్టి అక్కడక్కడా తన పాత సినిమాల స్టైల్ లోనే కథనం నడిపించారు. సినిమాలో యాక్షన్, ఎమోషనల్ పార్ట్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే సెకాండఫ్‌లో కథనం కూడా అంత ఆసక్తికరంగా సాగలేదు. ఈ సినిమాను శివ కార్తికేయన్, రుక్మిణీ వసంత్ తమ నటనతో కాస్తంత నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక సినిమా ప్రారంభం మొదలు, ముగింపు వరకూ ప్రతి సన్నివేశం కృత్రిమంగా ఉంది. కొత్తదనం ఉన్న సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అయితే మొత్తానికి ‘మదరాసి’ తెలుగువారిని మెప్పించలేకపోయాడు.

Also Read : అంతర్జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News