Tuesday, May 20, 2025

గుల్జార్‌హౌస్ ఘటనపై హెచ్‌ఆర్‌సి సీరియస్

- Advertisement -
- Advertisement -

సుమోటోగా కేసు నమోదు సిఎస్‌తో
సహా పలువురు అధికారులకు నోటీసులు
జూన్ 30వ తేదీలోగా ప్రమాదంపై
సమగ్ర విచారణ జరిపి నివేదిక
సమర్పించాలని ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని గు ల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కు ల కమిషన్ సీరియస్ అయింది. సుమోటోగా కేసు నమోదు చేసుకొని విచారణకు ఆదేశించింది. ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి, నగర సిపి, ఫైర్ డిజి, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌కు నోటీసులు జారీ చేసిం ది. జూన్ 30వ తేదీలోగా ప్రమాదంపై సమగ్ర విచార ణ నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిం ది. ఈ ఘటనలో సుమారు 17 మంది దుర్మ రణం పాలయ్యారు. భవన భద్రత, విద్యుత్ నిర్వహణ, అగ్నిప్రమాద నివారణ పరంగా నిబంధనల పా టింపు లోపించిన అవకాశమున్నదన్న మీడి యా లో వచ్చిన వార్తల ఆధారంగా కమిషన్ ఈ చర్య తీ సుకుంది. కాగా, గుల్జార్‌హౌజ్ చౌరస్తాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుం బానికి చెం దిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఒకే అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవ డం రాష్ట్ర చరిత్ర లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. మృతు ల్లో ఎనిమిది మంది చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News