- Advertisement -
హైదరాబాద్: బాక్సింగ్ పోటీల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో బాక్సర్ల కొట్లాట పోలీస్ స్టేషన్ కు చేరింది. నగరంలోని షేక్‌పేట్‌లో స్టేట్ లెవెల్ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఓ మ్యాచ్ జరుగుతుండగా.. తప్పుడు అంపైరింగ్తో ఓడిపోయామని ఆరోపిస్తూ ఓ టీమ్.. మరో టీమ్ పై దాడి చేసింది. దీంతో ఇరువార్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు జట్ల బాక్సర్లు, కోచ్ లు ఒకరినొకరు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ కొట్లాటలో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఇరు జట్ల బాక్సర్లు, కోచ్ లు.. గోల్కోండ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ ఘటనపై ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -