Thursday, August 21, 2025

అలుగునూరు పాఠశాలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/నూతనకల్ : మండల పరిధిలోని అలుగునూరు ప్రాథమిక పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పు నాగయ్య మాట్లాడుతూ విద్యార్ధుల ప్రగతిని పరిశీలించి, అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్ధులను, పరిశ్రమించిన ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల నుండి 51 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది. వాటి సక్సెస్ స్టోరీస్ ని ట్రయల్ బ్లేజర్స్ అను పుస్తకంగా విడుదల చేయడం జరిగిందని తెలిపారు. 2024 25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ప్రాక్టీసుడ్ స్కూల్స్‌లో మన పాఠశాల ఎంపిపిఎస్ అలుగునూరును రెండవ టైటిల్ గా ఎంపిక చేసినందుకు మొదటగా సెలక్షన్ కమిటికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సక్సెస్ స్టోరీని సోపానాల వారీగా క్రమ పద్ధతిలో అందించుటకు సహకరించిన ఎస్సీఈఆర్‌టి తెలంగాణ కన్సల్టెంట్ డా.సురేష్ బాబు కి, ఎస్‌ఆర్‌పిఎన్ ఇంగ్లీష్ పఠాన్ సార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, లింగాల శ్రీనివాస్, రేణుకతో పాటు విద్యార్ధుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News