Saturday, May 10, 2025

డిఫెన్స్ యాక్ట్ పరిధిలో రాష్ట్రాల చర్యలు

- Advertisement -
- Advertisement -

పాక్ ఘర్షణ దశలో కేంద్రం స్పందన

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌తో ఇప్పటి ఘర్షణల నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలూ , కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక మార్గదర్శకాలు వెలువరించింది. యుద్ధం లేదా సంఘర్షణల దశల్లో పౌరుల భద్రతకు తీసుకోవల్సిన చర్యలను ఈ చట్టంలో పొందుపర్చి ఉంచారు. ఈ సివిల్ డిఫెన్స్ యాక్ట్ లోని నిబంధనల మేరకు రాష్ట్రాలు పౌరుల భద్రతా చర్యలు చేపట్టాల్సిన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనికి 1968 నాటి సంబంధిత యాక్ట్‌ను ప్రామాణికంగా తీసుకుని తీరాలి. అత్యవసర జాతీయ భద్రత విపత్కర పరిస్థితుల దశలో రాష్ట్రాలు తమ ప్రాంత పరిస్థితులను బట్టి వెంట వెంట తగు చర్యలు తీసుకునేందుకు రాష్ట్రాలు తగు అధికారం సంతరించుకుంటాయి.

ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడటం, జాతీయ కీలక సంస్థల స్థావరాల రక్షణ, సరైన భద్రత వంటి వాటి కోసం ఈ చట్టం పరిధిలో రాష్ట్రాలు వెంటనే రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. నిద్రాణంగా ఉండే ఈ యాక్ట్‌ను ఇటువంటి ఘర్షణలు , యుద్ధం సమయంలో తిరిగి వాడుకునేందుకు వీలుంటుంది. దీనిని రాష్ట్రాలు, యుటిలకు ఇప్పుడు కేంద్రం సరైన విధంగా గుర్తు చేసింది. జాతీయ ప్రయోజనాల కేంద్రీకృత సంస్థల రక్షణ , పౌరుల భద్రతకు ఈ ప్రత్యేక యాక్ట్ ద్వారా వీలుంటుంది. కేంద్రానికి సరైన సమాచారం ద్వారా యాక్ట్ నిబంధనలను పాటిస్తూ రాష్ట్రాలు వెనువెంటనే తక్షణ చర్యలకు దిగడం ద్వారా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చూసుకునేందుకు వీలుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News