అమరావతి: ప్రతి భూమిపై సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు చేపట్టామని ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) తెలిపారు. క్యూఆర్ కోడ్ ఉండే పాస్ పుస్తకాలు తీసుకువస్తున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆగష్టు 15 నుంచి ఉచితంగా పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. వివిధ రకాల భూములకు రంగులు కేటాయింపుతో సులభంగా గుర్తింపు వచ్చిందని, 2027 డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే చేస్తామని తెలియజేశారు. శ్మశాన వాటికల నిర్మాణానికి రూ.138 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపిందని, పేదవాడికి నివాసయోగ్యమైన ఇళ్లు (Habitable houses) ఉండేలా చర్యలు చేపట్టామని అన్నారు. విలేకరుల మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు నిర్ణయించామని, 4.63 లక్షల రెవెన్యూ ఫిర్యాదుల్లో 3 లక్షలకు పైగా భూ సమస్యలకు పరిష్కారం ఉంటుందని చెప్పారు. ‘తొలి అడుగు’ లో వచ్చే ఫిర్యాదులను ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పరిష్కరిస్తామని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
పేదవాడికి నివాసయోగ్యమైన ఇళ్లు ఉండేలా చర్యలు చేపట్టాం: అనగాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -