Monday, September 15, 2025

ఏపి సిఎం జగన్‌పై రాళ్లతో దాడి

- Advertisement -
- Advertisement -

తలకు తీవ్రమైన గాయం
ఎడమకన్నుపైనుంచి రక్తం
ఎమ్మెల్యేకు రాళ్లగాయాలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. శనివారం విజయవాడలోని సింగ్‌నగర్‌లో మేమంతా సిద్దం బస్సుయాత్రలో ఉన్న సిఎం జగన్‌పై ఈ దాడి జరిగింది. బస్సుపైనుంచి ప్రజలకు అభివాదం చేస్తుండగా దుండగులు విసిరిన రాళ్లలో ఒక రాయి సూటిగా వచ్చి జగన్‌ను తాకింది. జగన్ ఎడమ కంటికి పైభాగన ఉన్న కనుబోమ్మపై తాకటంతో రక్తగాయం అయింది.

సిఎం పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా మరో రాయి తాకింది ఆయన కంటికి కూడా గాయం అయింది. బస్సులో ఉన్న వైద్యులు ముఖ్యమంత్రికి ప్రధమ చికిత్స అందించారు. అనంతరం జగన్ బస్సు యాత్రను ఆపకుండా కొనసాగించారు. విజయవాడ నగరంలో మూడున్నర గంటల పాటు అప్రతిహాతంగా బస్సుయాత్రను కొనసాగించారు.జనం ముఖ్యమంత్రిని చూసేందుకు భారీగా తరలివచ్చారు.

టిడిపి కుట్రలో భాగమే సిఎంపై దాడి
తెలుగుదేశం పార్టీ నేతల కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్‌పై దాడి జరిగిందని వైసిపినేతలు ఆరోపించారు. కృష్ణాజిల్లాలో ముఖ్యమంత్రి బస్సుయాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకనే కడుపు మంటతో తెలుగుదేశం నేతలు దాడి చేయించారన్నారు. ఓటమి భయంతో ఉక్రోషంతో చంద్రబాబు నాయుడు రగిలిపోతున్నారిని, అందుకే మొన్ననే జగన్ ఏం చేస్తానో నీకు చూపిస్తా అంటూ చంద్రబాబు వార్నింగ్ కూడా ఇచ్చారని తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించేందుకు పోలీసులు గాలింప చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News