Friday, September 12, 2025

రష్యన్ మిలిటరీలో భారతీయులను రిక్రూట్ చేయకండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రష్యా మిలిటరీలో భారతీయులను సపోర్ట్ స్టాఫ్‌గా రిక్రూట్ చేసే పద్ధతిని మానుకోవాలని భారత్, రష్యాకు గురువారం విజ్ఞప్తి చేసింది. అంతేకాక రష్యా సాయుధ బలగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఇదిలావుంగా రష్యా మిలిటరీలో చేరే ఆఫర్ల పట్ల భారతీయులు జాగురుకతతో వ్యవహరించాలంది. ‘రష్యా సైన్యంలో ఇటీవల భారతీయులను రిక్రూట్ చేస్తున్నారన్న వార్తలను మేము చూశాము’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆయన మీడియా వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ వివరాలు వెల్లడించారు. గత ఏడాది ప్రధాని మోడీ రష్యాను సందర్శించినప్పుడు కూడా ఈ విషయాన్ని లేవనెత్తారన్నది ఇక్కడ గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News