- Advertisement -
మన తెలంగాణ/భైంసా: పట్టణంలోని ఆనంద్ నగర్‌లో రిశేంద్ర అనే విద్యార్థి బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే బేతి సంతోష్, సాయి ప్రజ దంపతులకు కుమారుడు బేతి రిశేంద్ర, మరో కుమార్తె ఉంది. బాష్యం స్కూల్‌లో 9వ తరగతి పూర్తి చేసుకొని పదవ తరగతిలో చేరాల్సింది. గత కొంత కాలంగా విద్యార్థి పబ్జీ గేమ్‌కు బానిసగా మారి పాఠశాలకు వెళ్లకపోవడంతో ఇక్కడే ఉండిపోయాడు. పబ్జీ ఆటకు బానిసగా మారిన కుమారుడిని మార్చేందుకు రెండు రోజుల నుంచి ఆ గేమ్ ఆడకుండా కట్టడి చేశారు. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
- Advertisement -