అమరావతి: స్కూల్ లో విద్యార్థులు మద్యం మత్తులో పాఠశాల వంట మనిషిపై దాడి చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో జరిగింది. గొల్లనపల్లి హైస్కూల్‌లో రెండవ శనివారం సెలవు కావడంతో పాఠశాల మిద్దెపై తొమ్మిదవ, పదవ తరగతి విద్యార్థులు కూర్చొని మద్యం తాగుతున్నారు. విద్యార్థులు మద్యం సేవించడం వంట మనిషి కంచర్ల కాశమ్మ గమనించింది. మద్యం తాగిన విషయం వార్డెన్‌కు ఫిర్యాదు చేస్తానని విద్యార్థులతో చెప్పింది. వెంటనే విద్యార్థులు కోపంతో కాశమ్మపై దుప్పటి వేసి, గొంతు నులిమి దాడి చేశారు. గాయాలపాలైన కాశమ్మను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైస్కూల్ లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు చెడు మార్గానికి ఎక్కువగా ప్రభావితమవుతున్నారని దుయ్యబట్టారు.
Also Read: నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)