Saturday, July 26, 2025

5వ అంతస్తు నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని భవనం పై నుండి దుకి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సిఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.మియాపూర్ జనప్రియ నగర్ కాలనిలో నివాసం ఉంటున్న హన్సిక (15 ) మాధవనగర్ లోని సేయింట్ మార్టిన్ పాఠశాలలో 10 వ తరగతి చదువుతుంది.గురువారం మధ్యాహ్నం సమయంలో నివాసం ఉంటున్న భవనం 5 వ అంతస్థు పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో హన్సిక తలకు, శరీర భాగాలకు తీవ్రగాయయ్యాయి.

వెంటనే దగ్గర లోని అస్పత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు పరిశీలించి మృతి చెందిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. శనివారం రోజు అదే పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థి రిజ్వన్ పాఠశాల భవనం పైనుండి దూకి మరణించిన విషయం తెలిసిందే. అదే పాఠశాలకు చెందిన విద్యార్థి హన్సిక ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం చర్చనియంగా మారింది.5 రోజుల వ్యవధిలో ఒకే పాఠశాలకు చెందిన 10 తరగతి ఇద్దరు విద్యార్థులు హత్మహత్య చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News