హైదరాబాద్: బెట్టింగ్ యాప్‌లకు మరో విద్యార్థి బలయ్యాడు. బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకుని ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిటిలో అత్తాపూర్ పరిధిలోని రెడ్డి బస్తీలో ఉంటున్న గద్వాల్ జిల్లాకు చెందిన పవన్ అనే యువకుడు.. మాసబ్ ట్యాంక్ జెఎన్ టియులో ఎంటెక్ చదువుతున్నాడు.
ఈ క్రమంలో బెట్టంగ్ లకు అలవాటు పడి.. బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ పెట్టిన పవన్ ఒకేసారి 1 లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇంటి నుంచి తల్లిదండ్రులు పంపిన డబ్బులతోపాటు తన వద్ద ఉన్న ఐఫోన్, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌ను అమ్ముకొని బెట్టింగ్ పెట్టాడు. దాంట్లో మొత్తం డబ్బు పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన పవన్.. ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.