Monday, September 15, 2025

పరీక్ష గదిలో అమ్మాయిలను చూసి స్పృహ కోల్పోయాడు

- Advertisement -
- Advertisement -

 

పాట్నా: తాను ఇష్టపడిన అమ్మాయితో ఏకాంతంగా గడపాలని ఏ అబ్బాయికైనా ఆశ ఉంటుంది. అయితే ఒకే గదిలో పదుల సంఖ్యలో అమ్మాయిలు ఉంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏమిటి? బీహార్‌లోని ఒక పాఠశాలలో 12వ తరగతి పరీక్ష రాయడానికి వెళ్లిన అబ్బాయికి ఇదే పరిస్థితి ఎదురైంది. బీహార్ షరీఫ్‌లోని అల్లామా ఇక్బాల్ కాలేజ్ విద్యార్థి మణి శంకర్ గురువారం ఇంటర్‌మీడియట్ పరీక్ష రాసేందుకు బ్రిలియంట్ స్కూలుకు వెళ్లాడు. అయితే పరీక్ష గదిలో 50 మంది అమ్మాయిల మధ్యలో తాను ఒక్కడినే ఉండడం చూసి మణి శంకర్‌కు మైండ్ బ్లాక్ అయింది. కళ్లు తిరిగి స్పృహ కోల్పోయాడు. జ్వరంతో శరీరం కాలిపోతుండడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినట్లు మణి శంకర్ బంధువు ఒకరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News