Thursday, August 21, 2025

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో విషాదం

- Advertisement -
- Advertisement -

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో విషాదం నెలకొంది. ఓ ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థి బుధవారం రాత్రి పది గంటల సమయంలో హాస్టల్ గదిలోని బాత్ రూంలోకి వెళ్లారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు బాత్ రూం తలుపు తెరిచి చూశారు. స్నేహితుడు కిటికీకి ఉరి వేసుకుని కనిపించడంతో ఆందోళనకు గురై వేంపల్లి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఇంటర్ విద్యార్థి చనిపోయినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడి తల్లితండ్రులకు కళాశాల అధికారులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎంఎల్‌సి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆసుపత్రికి చెరుకుని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News