- Advertisement -
హాస్టల్‌లో ఉండడం ఇష్టం లేక 9వ తరగతి చదువుతున్న మధు లిఖిత అనే విద్యార్థిని సోమవారం హాస్టల్ భవనం నుండి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలం, కస్తూర్బా గాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్‌లో ఉంటుంది. అయితే తనకు వసతిగృహంలో ఉండి చదవడం ఇష్టం లేకపోవడంతో హాస్టల్ భవనంపై నుండి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన విద్యార్థినిని హస్టల్ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న విద్యర్థిని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.తనకు హాస్టల్‌లో ఉండి చదువుకోవడం ఏమాత్రం ఇష్టం లేకనే హాస్టల్ భవనం నుండి దూకినట్లు తెలిపింది.
- Advertisement -