- Advertisement -
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ.800 కోట్ల మేర రీయింబర్స్‌మెట్ బకాయిలు ఉందన్నారు. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థలు ప్రభుత్వాన్ని వేడుకొనే దుస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అగ్రహం వ్యక్తం చేశారు.
సకాలంలో పరీక్షలు నిర్వహించకపోతే.. పోటీ పరీక్షలు రాయడానికి మూడో సంవత్సరం విద్యార్థులు అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సిఎం, ఇతర మంత్రులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -