Thursday, July 31, 2025

గురుకుల సమస్యలపై రోడ్డెక్కిన విద్యార్ధులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / ఉండవెల్లి: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని బీసీ గురుకుల పాఠశాల 10వ తరగతి విద్యార్ధులు బుధవారం జాతీయ రహాదారిపై నడుచుకుంటూ వెళ్లి వారి సమస్యలను నెల రోజుల నుండి ప్రిన్సిపల్ టీచర్ల దృష్టికి తీసుకెళ్లనా విద్యార్ధులను పట్టించుకోవడం లేదని, మరుగుదొడ్లు, స్నానపు గదులు సరిగా లేవని, రాత్రి పూట బహిర్భూమికి బయటకు వెళ్లాల్సిన వస్తుందని చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని, పురుగులు అన్నం, నీళ్ల సాంబార్ మాకు మూడు ఇడ్లీలు పెడితే ఏ విధంగా సరిపోతాయని, తాగడానికి ప్లోరైడ్ వాటర్ ఉప్పు నీళ్లు తాగుతున్నామని, ఆ నీళ్లు తాగడం మూలంగా మాకు ఆరోగ్య సమస్యలు వచ్చాయని, వాళ్లు మాత్రం వాటర్ బాటిల్ తెచ్చుకుని తాగుతున్నారని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఈ సమస్యలను కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్లి గద్వాల కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

దాదాపు 7 కిలోమీటర్ల నడిచిన తర్వాత ఇటిక్యాలపాడు స్టేజి దగ్గరకు చేరే సరికి, ఇది గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసులు వచ్చి విద్యార్ధులకు సర్ది చెప్పిన వినకుండా రోడ్లపై పరుగులు తీస్తూ వెళ్లిపోయారు. ఇటిక్యాల పాడు స్టేజీ సమంపలో బస్టాండ్‌లో పిల్లలని ఆపిన సీఐ రవిబాబు పాఠశాలల టీచర్లు రేపు ఉదయం కలెక్టర్‌ను ముఖాముఖి చేపిస్తామని నచ్చచెప్పడంతో విద్యార్ధులను అక్కడి నుండి డిసిఎం నుండి మళ్లీ స్కూల్‌కు తరలించారు. పాఠశాల విద్యార్ధుల సమక్షంలో సంబంధిత అధికారులను పిలిచి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని సిఐ రవి బాబు, తహశీల్దార్ ప్రభాకర్ వచ్చి హమీ ఇచ్చారు. విద్యార్ధులకు పాఠశాలకు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News