Wednesday, September 3, 2025

పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి..11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ లో  మంగళవారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడి లో  11 మంది మరణించగా, సుమారు 18 మంది గాయపడ్డారు. బలోచిస్థాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మెంగల్ వర్ధంతి సందర్భంగా బలోచ్ రాజధాని క్వెట్టాలో బీఎన్పీ రాజకీయ సమావేశం నిర్వహించింది.  ఈ సభకు వందలాది మంది బలోచ్ మద్దతుదారులు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా బాంబులు ధరించిన ఓ వ్యక్తి తనకు తాను పేల్చుకొని ఆత్మాహుతి చేసుకున్నాడు .ఈ ఘటనలో కొందరు సంఘటన స్థలంలోనే మరణించగా, మరి కొందరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‌బాంబు దాడి జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News