- Advertisement -
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన ‘పోలీస్ వారి హెచ్చరిక’ టీజర్‌ను సుధీర్ బాబు ఆవిష్కరించారు. ఈ చిత్రానికి గజ్వేల్ వేణు సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ పోలీస్ వారి హెచ్చరిక టీజర్ ఒక అస్త్రంలా ఆకర్షణీయంగా, అందరినీ అలరించే విధంగా ఉందని అన్నారు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ… “నేను ఏ సినిమా చేసినా ఆ సినిమా తాలూకు ఏదో ఒక కార్యక్రమాన్ని సూపర్‌స్టార్ కృష్ణ చేతుల మీదుగా జరుపుకునే వాడిని. సుధీర్ బాబు ఈ టీజర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది”అని పేర్కొన్నారు. నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని ప్రముఖులు టైటిల్, ఫస్ట్ లుక్, లిరికల్ సాంగ్స్, ఆడియోను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్ పాల్గొన్నారు.
- Advertisement -