Tuesday, July 29, 2025

విధి ఆడిన చావు నాటకం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మణికొండలోని సుందర్ గార్డెన్స్ ముందు మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిఆర్ సి అపార్ట్ మెంట్ లో షాలిని అనే మహిళ తన పిల్లలతో కలిసి ఉంటుంది. ఆమె భర్త ఉద్యోగ రీత్యా ఆంధ్రాలో ఉంటున్నారు. ఆమె పిల్లలో విద్యాభవన్ స్కూల్ లో చదువుతున్నారు. మంగళవారం ఉదయం బస్సు మిస్ కావడంతో పిల్లలను స్కూటీపై స్కూల్ వద్ద దించి వస్తుండగా ఆమెను వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News