Friday, September 5, 2025

సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కు ట్రంప్ విందు

- Advertisement -
- Advertisement -

మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్ లను అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. ఇద్దరు భారతీయ- అమెరికన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ లు డోనాల్డ్ ట్రంప్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. టెక్, కృత్రిమ మేధస్సు రంగాలకు ఆయన విధానాలను ప్రశంసించారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గురువారం వైట్ హౌస్ లో టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ ల శక్తిమంతమైన బృందానికి ఘనమైన విందు ఇచ్చారు. హై ఐక్యూ గ్రూప్ అమెరికన్ వ్యాపార రంగంలో విప్లవానికి నాయకత్వం వహిస్తోందని ఆయన ప్రశంసించారు. ట్రంప్ ఇచ్చిన విందు ముందు రౌండ్ టేబుల్ సమావేశంలో ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లతో పాటు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిలియనీర్ బిల్ గేట్స్, మెటా సిఈఓ మార్క్ జుకర్ బర్గ్, ఆపిల్ సిఈఓ టిమ్ కుక్ ఇతరులు హాజరయ్యారు. వీరందరితో జరిగిన సమావేశంలో ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతూ ఇంతమంది తెలివైన మేధావుల పట్ల తాను చాలా గర్వపడుతున్నానని అన్నారు.

ఇది ఖచ్చితంగా అతి విశిష్ఠమైన ఐక్యూ గ్రూప్ అని ప్రశంసించారు. ఇంత మంది మేధావులతో సంభాషించడం గౌరవంగా ఉందని అన్నారు.వారంతా వ్యాపారంలో అగ్రగణ్యులు, మేధావులు అని, కీలకమైన రంగాల్లో విప్లవానికి నాయకత్వం వహిస్తున్నారని ట్రంప్ మెచ్చుకున్నారు. ప్రారంభ వ్యాఖ్యలు చేసిన తర్వాత టెక్నాలజీ రంగంలో వారంతా తన ఆలోచనలను పంచుకోవాలని ఆహ్వానించారు.సుందర్ పిచాయ్ సంక్షిప్తంగా మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ -ఏఐ- భవిష్యత్ లో అద్భుతాలను సృష్టిస్తుందని, అమెరికా ఈ రంగంలో అందరికంటే ముందు ఉండాలని సూచించారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నదని మెచ్చుకున్నారు. జూనలై నెలలో అమెరికా ప్రెసిడెంట్ ఆవిష్కరించిన ఏఐ యాక్షన్ ప్లాన్ ఈ దిశలో గొప్ప ప్రారంభం అని పిచాయ్ అభివర్ణించారు. తాము అంతా కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నమని అంటూ పిచాయ్ ట్రంప్ నాయకత్వానికి ధన్యవాదాలు

తెలిపారు.
ట్రంప్ సత్యనాదెళ్ల ను చూసి మైక్రోసాఫ్ట్ సాధించిన ప్రగతిని ప్రశంసించారు. ఒకప్పుడు 28 డాలర్లుగా ఉన్న మైక్రోసాఫ్ట్ స్టాక్స్ ప్రస్తుతం 500 డాలర్లుగా ఉందని పేర్కొన్నారు. అత్యున్నత సాంకేతిక సంస్థల అగ్ర నాయకులను ఒక చోట చేర్చినందుకు, ఈ రంగంలో అమెరికా ప్రెసిడెంట్ అనుసరిస్తున్న విధానాలకు ట్రంప్ కు నాదెళ్ల కృతజ్ఞతలు తెలిపారు. పారిశ్రామికాభివృద్ధికి దోహదపడేది కేవలం ఆవిష్కరణలే కాదని, ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కు యాక్సెస్ అందించిందని నాదెళ్ల తెలిపారు. నాదెళ్ల అనంతరం బిల్ గేట్స్ మాట్లాడుతూ తన కెరీర్ లో రెండో దశలో ఉన్నానని, అన్నారు.సత్యం చేసిన మంచిపనిని గుణించడానికి డబ్బు దానం చేస్తున్నానని అన్నప్పుడు ట్రంప్ నవ్వుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News