హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ సుందరకాండ. (Sundarakanda) నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ తరానికి ఇది చాలా కొత్త కథ. సుందరకాండ చాలా క్లీన్ ఫిలిం. సీన్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. -ఇందులో నా క్యారెక్టర్‌కి కొన్ని హద్దులు ఉంటాయి. 30 దాటినా కూడా కావలసిన లక్షణాలు ఉన్న అమ్మాయి కోసం వెతకడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. విభిన్నమైన నా పాత్ర మంచి వినోదాన్ని అందిస్తుంది.
-ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. -దర్శకుడు వెంకటేష్ ఏ కథ అయితే అనుకున్నాడో ఆ కథని అద్భుతంగా స్క్రీన్ మీద చూపించాడు. యూనిక్ కథని (Unique story) రాసుకున్నాడు. తను మంచి డైరెక్టర్. -ఇందులో సిరి క్యామియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తను నా లక్కీ చార్మ్ అనుకుంటున్నాను. భైరవం మంచి హిట్. ఈ సినిమా కూడా ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది. లియాన్ జేమ్స్ అద్భుతమైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమా చూసిన తర్వాత పాటలు మరింత కనెక్ట్ అవుతాయి. డియర్ ఐరా నా ఫేవరెట్ సాంగ్. సినిమాలో నరేష్ క్యారెక్టర్ చాలా బావుంటుంది. అలాగే సత్య క్యారెక్టర్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. -నాకు రొమాంటిక్ కామెడీస్, అలాగే స్పోర్ట్ డ్రామాలు ఇష్టం. మంచి స్పోర్ట్ డ్రామా వస్తే ఖచ్చితంగా చేస్తాను”అని అన్నారు.