- Advertisement -
ఐపిఎల్‌లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ గెలుపుతో లక్నో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలు కావడంతో లక్నో నాకౌట్ ఆశలు గల్లంతయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు మిఛెల్ మార్ష్ (65), మార్‌క్రమ్ (61) శుభారంభం అందించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 18.2 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. అభిషేక్ శర్మ 20 బంతుల్లోనే ఆరు ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇషాన్ (35), క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32) తమవంతు సహకారం అందించారు.
- Advertisement -