Sunday, August 3, 2025

రెడ్‌మి నోట్ 13 ప్రో ఫోన్ పై సూపర్ డిస్కౌంట్!

- Advertisement -
- Advertisement -

కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..?అయితే, మీకో గుడ్ న్యూస్. రెడ్‌మి నోట్ 13 ప్రో ఫోన్ ధర భారీగా తగ్గింది. ఇపుడు ఈ రెడ్‌మీ ఫోన్ దాని లాంచ్ ధర కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్ కార్ట్ నుండి రూ. 20,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కాగా, Xiaomi ఈ రెడ్‌మి ఫోన్‌ను రూ. 28,999 ప్రారంభ ధరకు విడుదల చేసింది. ఆఫర్ లో భాగంగా ఫోన్ ధరలో రూ. 10,000 తగ్గింపు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించి ఆఫర్, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఆఫర్

రెడ్‌మి నోట్ 13 ప్రో పరికరాన్ని మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. 8GB RAM + 128GB, 8GB RAM + 256GB, 12GB RAM + 256GB. ప్రస్తుత ఫ్లిప్ కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ రూ. 19,699 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. దీనితో పాటు, ఫోన్ కొనుగోలుపై 5 శాతం తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. అయితే, ఈ ఫోన్‌ను 693 ప్రారంభ EMIతో సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్లు

రెడ్‌మి నోట్ 13 ప్రో ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. డిస్ప్లే రిజల్యూషన్ 1.5K పిక్సెల్‌లు. ఇది 120Hz హై రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. డాల్బీ విజన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్‌తో సహా అనేక బలమైన ఫీచర్లు ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్‌ఓఎస్‌పై నడుస్తుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ ను అమర్చారు.

ఈ ఫోన్‌లో 12GB వరకు RAM, 256GB వరకు అంతర్గత నిల్వ ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. దీనికి 200MP ప్రధాన కెమెరా ఉంది. దీనితో పాటు, 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం..ఫోన్‌లో 16MP కెమెరా ఉంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో 5100mAh బ్యాటరీని పొందుతుంది. దీనితో పాటు, ఈ ఫోన్ IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News