ఫ్యాటీ లివర్ అనేది ప్రస్తుతం చాలామందిని ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్య. అధిక కొవ్వు పదార్థాలు, అనారోగ్యకరమైన ఆహారం, భౌతిక వ్యాయామం లేమి వల్ల లివర్ లో కొవ్వు పేరుకుపోతుంది. అయితే దీన్ని సకాలంలో గుర్తించి సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి పాటిస్తే లివర్‌ను తిరిగి ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. అయితే, ఇప్పుడు ఫ్యాటీ లివర్ ను తగ్గించే కొన్ని ఆహారల గురించి తెలుసుకుందాం.
ఫ్యాటీ లివర్ ను తగ్గించే కొన్ని ముఖ్యమైన ఆహారాలు
ఆకుకూరలు
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటయి, దీంతో ఇవి లివర్ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఇందులో ఉండే గ్లూటాథియోన్ అనే పదార్థం లివర్ దెబ్బతినకుండా కాపాడుతుంది.
కాఫీ
రోజుకు 1-2 కప్పుల కాఫీ తాగితే లివర్‌లో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. ఇందులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ లివర్ వాపును తగ్గించి, ఇన్సులిన్ నిరోధకతను సరిచేస్తుంది.
ఓట్స్
ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఓట్స్‌లో ఉండే బీటా గ్లూకాన్ అనే పదార్థం లివర్‌లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. క్రమం తప్పకుండా ఓట్స్ తీసుకోవడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
వెల్లుల్లి
ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల లివర్‌ను డీటాక్స్ చేసే ఎంజైములు ఉత్పత్తి అవుతాయి. ఇది లివర్‌లోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
గ్రీన్ టీ
ఇందులో ఉన్న కాటేచిన్స్ లివర్ పనితీరు మెరుగుపరుస్తాయి. రోజుకు 1-2 కప్పులు తాగడం వల్ల కొవ్వు తగ్గుతుంది. అంతేకాకుండా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.